సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (14:18 IST)

ఇంట్లోనే కరోనాకు చికిత్స.. ఏపీలో 24 గంటల్లో 60 కొత్త కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గురువారం 71 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 7902 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్త కేసులు బయటపడ్డాయి. అనంతపూర్‌లో 6, గుంటూరులో 19, కర్నూలులో 25, విశాఖపట్నంలో 2, పశ్చిమ గోదావరిలో 2, కడపలో 6 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 1463కు చేరింది. 
 
అటు.. రాష్ట్రవ్యాప్తంగా 403 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొత్తగా మరో ఇద్దరు చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 33కు చేరుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో 1027 మంది చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు కరోనాల క్షణాలు ఉండి 50 ఏళ్ల లోపు వారికి ఇంట్లోనే చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించింది. 14 రోజులు స్వీయ నిర్భంధంలో ఉండాలని, ఇంట్లో ప్రత్యేక వసతులు ఉండాలని చెప్పింది. 
 
ఏపీలో 75శాతం కేసుల్లో కరోనా లక్షణాలు కనిపించడంలేదని పేర్కొంది. ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో 1,050 కేసులు ఇలాంటివేనని వివరించింది. ఇటువంటి వారి ద్వారానే కరోనా వైరస్‌ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించడమొక్కటే మార్గమని పేర్కొంది.