ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (12:29 IST)

లాక్ డౌన్- 70 లక్షల మహిళలకు గర్భం.. కారణం ఏమిటంటే?

Pregnancy
ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో 70లక్షల మేర గర్భాలు నమోదయ్యే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమతి పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే కాలం గడిపే వారి సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో.. ఊహించని రీతిలో గర్భధారణ జరిగే అవకాశాలున్నాయని ఐరాస చెప్పింది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలులో వున్న తరుణంలో జనాభాపై ఐరాస అధ్యయనం జరిపింది. 
 
లాక్ డౌన్ కారణంగా వస్తువుల ఎగుమతి, దిగుమతి, ఉత్పత్తికి పలు అడ్డంకులు ఏర్పడినట్లు తేలింది. అంతేగాకుండా.. లాక్ డౌన్‌తో గర్భనిరోధక మాత్రలు, ఇతరత్రా వస్తువుల కొరత ఏర్పడే అవకాశం వుంది. తద్వారా దాదాపు నాలుగు కోట్ల 70 లక్షల మహిళలకు గర్భనిరోధక మాత్రలు అందుబాటులో వుండని తెలుస్తోంది. ఫలితంగా రానున్న నెలల్లో గర్భం ధరించే మహిళల సంఖ్య పెరుగుతుందని ఐరాస వెల్లడించింది. 
 
ఇంకా పురుషులు, మహిళలు ఇంట్లోనే వుండగా.. గృహ హింస పెరిగే అవకాశం వుందని ఇప్పటికే అధ్యయనాలు తెలిపాయి. రానున్న ఆరు నెలల్లో 3కోట్ల 10లక్షల గృహ హింస కేసులు నమోదయ్యే అవకాశం వున్నట్లు ఐరాస అంచనా వేస్తోంది. ఇంకా బాల్య వివాహాలు కూడా జరిగే ఛాన్సుందని ఐరాస హెచ్చరిస్తోంది.