శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

డేటింగ్ పార్టనర్‌కు ఓట్లేసి గెలిపించమన్న హార్దిక్ పాండ్యా

భారత యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యా. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ఐటం గర్ల్ నటాషా స్టాంకోవిచ్‌‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. పైగా, ఆమెతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. 
 
ఈ క్రమంలో నటాషా నాచ్ బలియే అనే డ్యాన్స్ రియాల్టీ షోలో పాలుపంచుకుంటోంది. పైగా, గతంలో షారూక్ ఖాన్ నటించిన జీరో చిత్రంలో ఓ పాత్రలో నటించింది. సెర్బియాకు చెందిన ఈ భామ.. బాలీవుడ్‌లో ఐటమ్ గర్ల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
 
ఈ నేపథ్యంలో రియాల్టీ షోలో పాలుపంచుకుంటున్న నటాషాకు ఓట్లు వేయాలని కోరుతున్నాడు. కాగా, గాయానికి చికిత్స చేయించుకున్న హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెల్సిందే.