మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2019 (16:23 IST)

రాహుల్ వర్సెస్ శ్రీముఖి.. సోషల్ మీడియాలో వార్.. ఆమె కోసం సైరా సాంగ్

బిగ్ బాస్ మూడో సీజన్ విజేత ఎవరో తెలిసేందుకు ఇంకా రెండు రోజులే మిగిలివున్నాయి. ఈ నేపథ్యంలో తమ అభిమాన కంటిస్టెంట్లకు ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో శీముఖి అభిమానులకు రాహుల్ ఫ్యాన్సుకు పెద్ద వారే జరుగుతోంది. ఇప్పటికే శ్రీముఖి 'రాములమ్మ కాంటెస్ట్‌'తో వినూత్న ప్రచారానికి దిగింది. 
 
ఇప్పటికే వరుణ్‌ కోసం అభిమానులు ఓ పాటతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇదే ఫార్ములాను శ్రీముఖి అభిమానులు ఫాలో అయ్యారు. ఇందుకోసం లేటెస్ట్‌ మూవీ 'సైరా'ను వాడుకున్నారు. సైరా టైటిల్‌ సాంగ్‌ను శ్రీముఖి కోసం రీమిక్స్ చేశారు. బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ గెలిచేది శ్రీముఖే అంటూ పవర్‌ఫుల్‌ లైన్‌లతో హోరెత్తించారు. 
 
నిన్ను గెలిపించుకుంటాం అంటూ ఆమెకు నీరాజనం పలికారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో సాగిన జర్నీని ప్రతిబింబించేలా వీడియోను రూపొందించారు. ఇది చూసిన అభిమానులు శ్రీముఖికి ఓట్లు వేసేస్తున్నారు. ఎవరెన్ని పోరాటాలు చేసినా గెలుపు ఒక్కరిదే. శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఓటింగ్‌లో దూసుకుపోతున్న తరుణంలో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే వేచి చూడాలి.

వీడియో కోసం ఈ లింకును క్లిక్ చేయండి.. 

https://www.instagram.com/tv/B4UQG2Ap59y/?utm_source=ig_web_copy_link