మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 13 అక్టోబరు 2019 (12:13 IST)

చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్‌కి మోడీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి..?

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రధాని మోడీతో చర్చలు జరిపేందుకు ఇండియా వచ్చారు.  ఇండియాలోని మహాబలిపురంలో ఈ ఇరువురు నేతలు నిన్న సమావేశం అయ్యారు.  భారత్.. చైనా మధ్య పరస్పర సహకారం.. పర్యాటకం.. వాణిజ్యం తదితర అంశాలపై అత్యున్నత స్థాయిలో చర్చించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 
 
మోడీని చైనా పర్యటనకు రావాల్సింది జిన్ పింగ్ కోరారని.. ఆయన ఇన్విటేషన్‌ను మోడీ అంగీకరించినట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే.. చైనా అధ్యక్షుడి భారత్ పర్యటన దాయాది పాక్ కు మింగుడుపడని రీతిలో సాగినట్లుగా చెప్పాలి. ఇరు దేశాలు మర్యాదపూర్వకంగా వ్యవహరించటంతో పాటు.. ఒకరి అంశాల్లోకి మరొకరు పోకుండా ఉండటంతో తమ మధ్య కనిపించని దూరాన్ని తగ్గించే ప్రయత్నం తాజా పర్యటనలో జరిగిందని చెప్పాలి.
 
అస‌లు విష‌యానికి వ‌స్తే.. జిన్ పింగ్ కోసం మోడీ కొన్ని ప్రత్యేకమైన కానుకలు బ‌హుక‌రించారు. ఇంత‌కీ ఆ గిఫ్ట్ ఏంటంటే...జిన్ పింగ్ చిత్రంతో కూడిన ప‌ట్టు చేనేత వ‌స్త్రాన్ని మోదీ అంద‌చేసారు. దీనిని కోయంబ‌త్తూర్ లోని సౌదాంబిగై చేనేత క‌ళాకారుల సంఘం వారు ప్ర‌త్యేకంగా రూపొందించారు. మ‌ల్బ‌రీ ప‌ట్టు, ఎరుపు రంగు వ‌స్త్రం పై జిన్ పింగ్ చిత్రాన్ని బంగారు దారం అల్లిక‌తో త‌యారు చేసారు. ఈ గిఫ్ట్ చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.