1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. IPL 2018: Sun Risers Hyderabad Thrash Delhi Daredevils; Enter Playoffs

ఐపీఎల్ 2018 : ఢిల్లీ నాకౌట్ ఆశలు గల్లంతు.. ప్లేఆఫ్‌లో హైదరాబాద్

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ప్లే ఆఫ్ ఆశలను హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవాన్ గల్లంతు చేశాడు. ధవన్ (నాటౌట్) 92, విలియమ్సన్ (నాటౌట్) 83 ఆకాశమే హద్దుగా చెల

IPL 2018
ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ప్లే ఆఫ్ ఆశలను హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవాన్ గల్లంతు చేశాడు. ధవన్ (నాటౌట్) 92, విలియమ్సన్ (నాటౌట్) 83 ఆకాశమే హద్దుగా చెలరేగడంతో హైదరాబాద్ జట్టు 18.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 191 పరుగులు చేసిం దర్జాగా ప్లే ఆఫ్ బెర్త్‌ను మరింత పటిష్టం చేసుకుంది.
 
మరోవైపు ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్ (63 బంతుల్లో 128 నాటౌట్; 15 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరోచిత సెంచరీ వృధా అయింది. హైదరాబాద్ జట్టు బౌలర్లు రాణించిన చోట ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. ఫలితంగా కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ బోల్తా కొట్టి.. నాకౌట్ ఆశలను గల్లంతు చేసుకుంది. 
 
గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 9 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. దీంతో 9 విజయాలతో 18 పాయింట్లతో టాప్‌లోకి దూసుకెళ్లింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. రిషబ్ స్ఫూర్తిదాయకంగా ఆడినా.. మిగతా సహచరులు సహకారం అందించడంలో విఫలమయ్యారు. తర్వాత హైదరాబాద్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 191 పరుగులు చేసింది. శిఖర్, విలియమ్సన్ రెండో వికెట్‌కు అజేయంగా 17 ఓవర్లలో 176 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి జట్టుకు విలువైన విజయాన్ని అందించారు. ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 
 
ఇరు జట్ల స్కోరు బోర్డు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా 9, రాయ్ 11, శ్రేయాస్ రనౌట్ 3, రిషబ్ పంత్ నాటౌట్ 128, హర్షల్ రనౌట్ 24, మ్యాక్స్‌వెల్ 9, శంకర్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 20 ఓవర్లలో 187/5. 
 
సన్‌రైజర్స్ హైదరాబాద్: హేల్స్ 14, ధవన్ నాటౌట్ 92, విలియమ్సన్ నాటౌట్ 83, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 18.5 ఓవర్లలో 191/1. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రహానేను తప్పించారా షాకైన దాదా.. డే/నైట్ టెస్టులాడే సత్తా మనోళ్లకుంది..