ఔరా.. క్యాచ్ పట్టావా.. చెట్టుమీదున్న మామిడి పండును తెంపినావా? (వీడియో)
ఐపీఎల్ 2018 మ్యాచ్‌లో ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అయితే, అతి తక్కువ స్కోర్లు చేసినప్పటికీ.. ప్రత్యర్థి జట్టుకు గెలుపు అవకాశాలు లేకుండా చేయడంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఆరితేరింది. ఈ కోవలోనే సోమవారం
ఐపీఎల్ 2018 మ్యాచ్‌లో ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అయితే, అతి తక్కువ స్కోర్లు చేసినప్పటికీ.. ప్రత్యర్థి జట్టుకు గెలుపు అవకాశాలు లేకుండా చేయడంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఆరితేరింది. ఈ కోవలోనే సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ సాగింది.
బెంగళూరుపై 146 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని ప్లేఆఫ్స్ చేరిన తొలి టీమ్‌గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో వెటరన్ ప్లేయర్ యూసుఫ్ పఠాన్ ఒంటిచేత్తో పట్టిన క్యాచ్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఆ వికెట్ కూడా సాధారణ వ్యక్తిది కాదు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిది. అప్పటికే అతను జోరు మీదున్నాడు. కోహ్లి ఇంకాసేపు క్రీజులో ఉంటే ఆర్సీబీ సునాయాసంగా గెలిచివుండేది.
ఆ సమయంలో షకీబుల్ హసన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడటానికి కోహ్లీ యత్నించాడు. షార్ట్ థర్డ్‌మ్యాన్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న యూసుఫ్ పఠాన్ గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో సింపుల్‌గా క్యాచ్ పట్టేశాడు. అది చూసి అందరూ షాక్ తిన్నారు. చూడటానికి సింపుల్‌గా కనిపిస్తున్నా ఈ సీజన్ బెస్ట్ క్యాచుల్లో ఇదీ ఒకటి అని చెప్పొచ్చు. ఈ క్యాచ్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు కూడా. అలాగే, యూసుఫ్ తమ్ముడు ఇర్ఫాన్ కూడా ట్విట్టర్‌లో స్పందించాడు. క్యాచ్ పట్టినవా.. చెట్టు మీదున్న మామిడి పండు తెంపినవా అంటూ ఇర్ఫాన్ చమత్కరించాడు. ఆ వీడియోను మీరూ చూడండి.