1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Mohammad Azharuddin Trolled For Tweet on Stuart Broad

అజారుద్దీన్ దేశద్రోహి.. హెచ్‌సీఏ సెక్రటరీ గురవా రెడ్డి ఫైర్

Mohammad Azharuddin
అజారుద్దీన్ దేశద్రోహి అని… హెచ్‌సీఏలో ఆయన చేసిన అక్రమాలను బయట పెట్టాలని.. హెచ్‌సీఏ సెక్రటరీ గురవా రెడ్డి అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అధ్యక్షుడు అజారుద్దీన్ మా పై నాంపల్లి కోర్టులో పరువు నష్ట దావా కేసు వేశారని… హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించిందుకు మాపై పరువు నష్ట దావా కేసు వేసాడని నిప్పులు చెరిగారు.
 
అజరుద్దీన్ రెండు కోట్లకు మాపై సివిల్ సూట్ కేసు వేశాడని… ఫేస్‌బుక్‌లో ఆరోపణలు చేసినందుకే మాపై పరువు నష్ట దావా కేసు వేసాడని తెలిపారు. అజరుద్దీన్ పై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసులను మళ్ళీ రీ-ఓపెన్ చెయ్యాలని.. సీబీఐ చేత అజారుద్దీన్ కేసు విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సివిల్ సూట్‌లో వేసిన పిటీషన్‌ను మేము కౌంటర్ వేసామని.. మేము వేసిన కౌంటర్‌కు ఇప్పటి వరకు అజారుద్దీన్ నుంచి సమాధానం లేదని మండిపడ్డారు.
 
హెచ్‌సీఏలో వాళ్లకు మధ్య వర్గ పోరు జరుగుతుందన్నారు. బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలను హెచ్సీఏ అధ్యక్షుడుగా చెప్పుకుంటున్న అజరుద్దీన్ అమలు చెయ్యడం లేదన్నారు. బిసిసిఐ ఇచ్చిన గైడ్ లెన్స్‌ను అమలు చేయాలని పేర్కొన్నారు.
తర్వాతి కథనం
ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఓ బుడ్డోడు.. వీడియో వైరల్