1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (08:51 IST)

బీసీసీఐ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా అజారుద్దీన్

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వర్కింగ్ కమిటీ సభ్యుడుగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఈ వర్కింగ్ ప్యానెల్‌లో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు. 
 
దేశవాళీ క్రికెట్ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూపు దేశవాళీ ఆటగాళ్లకు పరిహార ప్యాకేజీతోపాటు దేశవాళీ క్రికెట్‌లోని ఇతర అంశాలపై ఈ 10 మంది సభ్యుల ప్యానెల్ పనిచేస్తుంది. 
 
గత నెల 20న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్‌లో అజారుద్దీన్‌తో పాటు రోహన్ జైట్లీ, అవిషేక్ దాల్మియా కూడా ఈ గ్రూపులో ఉన్నారు. 
 
ఈ ప్యానెల్‌లో ఉన్న మిగతా వారిలో యుధ్‌వీర్ సింగ్ (సెంట్రల్ జోన్), దేవజీత్ సైకియా (నార్త్‌ఈస్ట్ జోన్), సంతోష్ మేనన్ (సౌత్ జోన్) ఉన్నారు. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్‌తో ఏర్పాటైన ఈ ప్యానెల్ గంగూలీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.