1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Veteran cricketer Gopalaswamy Kasturirangan passes away

పిచ్ క్యూరేటర్ కస్తూరి రంగన్ ఇకలేరు...

Veteran cricketer Gopalaswamy Kasturirangan
భారత క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్, పిచ్ క్యూరేటర్‌గా పని చేసిన గోపాలస్వామి కస్తూరి రంగన్ ఇకలేరు. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయనకు గుండెపోటు రావడంతో కర్నాటక రాష్ట్రంలోని చామరాజపేటలో ఉన్న తన నివాసంలోనే కన్నుమూశారు. ఆయన వయసు 89 యేళ్లు. 
 
ఈ విషయాన్ని కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి, అధికార ప్రతినిధి వినయా మృత్యుంజయ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. మైసూరు రాష్ట్రానికి చెందిన ఆయన... ఆ రాష్ట్రం తరపునే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. ఫాస్ట్ బౌలర్ అయిన ఆయన మైసూర్ తరపున 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 94 వికెట్లు తీశారు.
 
1952లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా భారత జాతీయ జట్టుకు ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లలేకపోయారు. కర్ణాటక జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించిన కస్తూరి రంగన్ కర్ణాటక క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా, బీసీసీఐ క్యురేటర్‌గా, బోర్డు అధికార ప్రతినిధిగా సేవలందించారు. కస్తూరిరంగన్ మృతికి టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే విచారం వ్యక్తం చేశాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశాడు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఐపీఎల్ తర్వాత ఫ్యాన్స్‌కి పండగే.. ధోనీకి వీడ్కోలు మ్యాచ్ తప్పక వుంటుందా?