ప్లీజ్.. ధోనీ కోసం ఒక్క వీడ్కోలు మ్యాచ్ పెట్టండి.. జార్ఖండ్ సీఎం

hemanth soren
ఠాగూర్| Last Updated: ఆదివారం, 16 ఆగస్టు 2020 (08:42 IST)
భారత క్రికెట్ జట్టుకు అమూల్యమైన సేవలు అందించిన జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఈ మేరకు ఆదివారం ఆయన అధికారిక ప్రకటన చేశారు. అయితే, ఎలాంటి వీడ్కోలు లేకుండానే ధోనీ రిటైర్ కావడాన్ని ఆయన అభిమానులు, మాజీ క్రికెటర్లు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. పైగా, ధోనీ స్వరాష్టమైన జార్ఖండ్ రాష్ట్రం కూడా ఘనంగా వీడ్కోలు చెప్పాలన్న ఆశతో ఉంది.

ఈ క్రమంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ఓ విజ్ఞప్తి చేశారు. భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలను అందించిన మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఒక్క ఫేర్ వెల్ మ్యాచ్‌ని పెట్టాలని, దాన్ని అతని సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌ రాష్ట్ర రాజధాని రాంచీని వేదిక చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బీసీసీఐని కోరారు.

రాంచీలో ఓ మ్యాచ్‌ని
జరిపి, ధోనీకి ఘనమైన వీడ్కోలును ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. ధోనీ సొంత రాష్ట్రం జార్ఖండ్ అన్న సంగతి తెలిసిందే. అయితే, హేమంత్ సోరెన్ అభ్యర్థనపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ధోనీ కోసం ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహిస్తే, అది అతని ఫ్యాన్స్‌కు ఎంతో ఆనందకరమైన రోజవుతుందనడంలో సందేహం లేదు. కాగా, నిన్న తాను క్రికెట్‌కు రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నట్టు ధోనీ అనూహ్య ప్రకటన చేయడం అభిమానులకు షాక్ కలిగించింది.దీనిపై మరింత చదవండి :