శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (11:39 IST)

ఏడేళ్ల పారి శర్మ బ్యాటింగ్ అదుర్స్.. ధోనీని గుర్తి చేస్తోందిగా.. వీడియో వైరల్

Pari
యంగ్ గర్ల్, పారి శర్మ బ్యాటింగ్ చేసిన వీడియోను ఆకాష్ చోప్రా షేర్ చేయగా, ట్విట్టర్ యూజర్లు ఎంఎస్ ధోనిని గుర్తు చేసుకుంటున్నారు. భారత మాజీ యువ బ్యాట్స్‌మన్ ఆకాష్ చోప్రా గురువారం ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. Thursday Thunderbolt... ఆమె సూపర్ టాలెంటెడ్ కాదా? అంటూ వీడియోను పంచుకుంటూ చోప్రా ట్విట్టర్‌లో రాశారు. 
 
చిన్న క్లిప్‌లో, పారి శర్మ హెలికాప్టర్ షాట్‌ను అద్భుతంగా అమలు చేయడాన్ని చూడొచ్చు. ఈ వీడియోను చూసిన యూజర్లు వెంటనే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోలికలు గుర్తించారు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పుడు వినూత్న షాట్‌ను కనుగొన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా ఆమెను పొగిడేస్తున్నారు. 
 
''వావ్ ఆమె బేబీ గర్ల్ వెర్షన్ క్రికెటర్ ధోని అనిపిస్తోంది, దీన్ని ఇష్టపడింది సర్ అని మరో యూజర్ ట్వీట్ చేశారు. "ధోని అమ్మాయి అయితే" ఇలా వుండేదేమోనని మరొక అభిమాని రాశాడు. బ్యాట్ వేగం అద్భుతంగా ఉందని.. అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా ఈ హెలికాప్టర్ షాట్‌ను మహిళా క్రికెటర్ ఆడలేదని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
పారి శర్మ సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్, వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ ఆమె బ్యాటింగ్ చేసిన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.