గోదావరీ పరివాహక ప్రాంతంలో పెద్దపులి సంచారం.. ట్రాకర్ అమర్చినా..?
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని గోదావరి నదీ పరివాహక అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు వార్తలు రావడంతో అశ్వారావుపేట మండలంలోని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
అశ్వారావుపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మురళి మాట్లాడుతూ, పులికి ట్రాకర్ అమర్చినప్పటికీ, అది స్థానిక అటవీ ప్రాంతంలో ఎక్కడా కనిపించలేదని, దాని అడుగుజాడలు కూడా ఎక్కడా లభించలేదని తెలిపారు.
అయినప్పటికీ, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అడవిలోకి వెళ్లవద్దని అటవీ శాఖ సిబ్బంది సూచిస్తున్నారు.
ఈ పులి ఆంధ్రప్రదేశ్‌లోని వేలేరుపాడు మండలం కొత్తూరు ప్రాంతంలో కనిపించి ఉండవచ్చని, అక్కడ గత కొన్ని రోజుల్లో నాలుగు ఆవులను చంపేసిందని భావిస్తున్నారు. ఇది పాపికొండ జాతీయ పార్కు నుండి గ్రామాల్లోకి వచ్చి ఉండవచ్చని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పేర్కొన్నారు.
స్థానికుల కథనం ప్రకారం, గత ఏడాది అశ్వారావుపేట మండలంలోని కవాడిగుండ్ల, కన్నాయిగూడెం ప్రాంతాల్లో పులి సంచరించినట్లు సమాచారం. అప్పట్లో కూడా ఈ పులి కొన్ని ఆవులను చంపేసినట్లు చెబుతున్నారు.

