1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Assault on Britain Woman in Nellore District

వరల్డ్ ఉమెన్స్ డే : నెల్లూరులో బ్రిటన్ మహిళపై అత్యాచారం

Assault
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
నెల్లూరు జిల్లాకు సమీపంలోని సైదాపురం సమీపంలోని రూపూరు రోడ్డులో బ్రిటన్ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే కేసు రంగంలోకి దిగి నిందితుల ఆచూకీ కోసం విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తరుణంలో విదేశీ మహిళపై అత్యాచారం జరగడం స్థానికంగా కలకలం చెలరేగింది. దీంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
జాయ్‌ ఆఫ్‌ గివింగ్‌ను కమ్యూనిటీల కోసం వేడుక చేస్తున్న గస్‌ ఎడ్యుకేషన్‌ ఇండియా