శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 8 మార్చి 2022 (18:38 IST)

జాయ్‌ ఆఫ్‌ గివింగ్‌ను కమ్యూనిటీల కోసం వేడుక చేస్తున్న గస్‌ ఎడ్యుకేషన్‌ ఇండియా

కమ్యూనిటీలకు మద్దతును విస్తరించడంలో భాగంగా గస్‌ ఎడ్యుకేషన్‌ ఇండియా (జీఈఐ) ఇప్పుడు సొసైటీ ఆఫ్‌ హెల్త్‌, ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎకనమికల్‌ ప్రోగ్రెస్‌ (షీప్‌)కు పౌష్టికాహారం, పరిశుభ్రతావసరాలను 4 నుంచి 20 సంవత్సరాల లోపు బాలికలు/మహిళలు అందించడం ద్వారా సహాయపడింది. దీనిలో భాగంగా 180కేజీలు/లీటర్‌ నిత్యావసరాలు (గోధుమలు, బియ్యం, ఉప్పు, పంచదార, మసాలాలు, నూనె, పప్పులు మొదలైనవి), 60కు పైగా క్లీనింగ్‌ మెటీరియల్స్‌ (చీపుర్లు, గార్బేజ్‌ బిన్స్‌, మాప్స్‌, బకెట్స్‌, మగ్స్‌ మొదలైనవి), 50కు పైగా సాధారణ పరిశుభ్రతావసరాలు (సబ్బులు, క్లీనర్స్‌, శానిటరీ ప్యాడ్స్‌ మొదలైనవి), మాస్కులు, గ్రోసరీలు, వస్త్రాలు, స్టేషనరీ మొదలైనవి సేకరించారు.

 
గస్‌ ఎడ్యుకేషన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశి జలిగామా మాట్లాడుతూ, ‘‘షీప్‌తో మేము మా సేవా కార్యక్రమాలను ప్రారంభించాము. ఇదే తరహా సహాయాన్ని వీలైనంతగా కమ్యూనిటీలకు అందించడానికి ప్రణాళిక చేస్తున్నాము. లింగ వైవిధ్య కార్యక్రమాల పట్ల మా దృష్టికి అనుగుణంగా ఉండటం చేత షీప్‌ను మేము ఎంచుకున్నాము. ఓ సంస్థగా మేము మా ఉద్యోగులలో 40% మహిళలకు స్థానం కల్పించాము. త్వరలోనే మరిన్ని కమ్యూనిటీ కార్యక్రమాలను చేయనున్నాము’’ అని అన్నారు.

 
‘‘దక్షిణ భారతదేశంలో నిబద్ధత కలిగిన స్వచ్ఛంద సంస్థలలో ఒకటి షీప్‌. ప్రధానంగా చిన్నారుల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణం, నీరు, శానిటైజేషన్‌, మానవహక్కులను లక్ష్యంగా పెట్టుకున్నాం. గస్‌ ఎడ్యుకేషన్‌ ఇండియాతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. మహిళలు, బాలికలకు మద్దతునందించేందుకు వారి ఉద్యోగులు ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఈ తరహా మరిన్ని భాగస్వామ్యాలు వైవిధ్యతను తీసుకురానున్నాయి’’ అని షీప్‌ ఎన్‌జీవో ఫౌండర్‌ అండ్‌ ప్రెసిడెంట్‌ జి.నిర్మల అన్నారు.