బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (14:53 IST)

సీఎం జగన్ రెడ్డికి షాక్- RRR పిల్‌కు నెంబర్ కేటాయించండి..

తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో పలు అంశాలపై సీబీఐ, ఈడీ విచారణ జరపలేదని రఘురామ ఇటీవల పిల్ దాఖలు చేశారు. పలు అభ్యంతరాలను కారణంగా చూపుతూ హైకోర్టు కార్యాలయం ఆ పిల్‌ను అనుమతించని విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 'రఘురామ పిల్‌కు నెంబర్ కేటాయించండి. పిల్ విచారణ అర్హతను తేల్చాల్సి ఉంది' అని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో రిజిస్ట్రీ తెలిపిన అభ్యంతరాలను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.