శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (19:16 IST)

మహిళా ఉద్యోగులందరికీ సెలవు

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులందరికీ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
 
ఉమెన్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాత్రి తాజ్‌కృష్ణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. 
 
మరోవైపు అదే సమయంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలోనూ వేడుకలు జరగనున్నాయి. గవర్నర్‌ నెలకొన్న విబేధాల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోయి ఈ స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.