బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (09:00 IST)

హైదరాబాద్‌లో దారుణం.. యువతిపై అత్యాచారం

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. యువతిపై అత్యాచారం జరిగింది. రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ యువతి పరిచయమైంది. ఆ తర్వాత ఈ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగర్‌లో జరిగింది. 
 
స్థానిక సులేమాన్ నగర్‌కు చెందిన సాజిత్ (27) అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలు పని చేస్తున్నాడు. ఈయనకు రెండు రోజుల క్రితం ఇన్‌స్టా ద్వారా ఓ 20 యేళ్ల యువతి పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. 
 
ఈ క్రమంలో ఇద్దరం ఒకసారి కలుసుకుందానని యువతిని సాజిత్ కోరగా ఆమె కూడా సమ్మతించి రాజేంద్ర నగర్‌కు వచ్చింది. అక్కడ నుంచి బైకుపై ఎక్కించుకున్న సాజిత్ తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె 100కు డయల్ చేసి జరిగిన విషయం చెప్పింది. ఆ వెంటనే అక్కడు చేరుకున్న పోలీసులు... సాజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.