ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (19:19 IST)

'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి టీజర్ (video)

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి టీజర్ విడుదల అయ్యింది. ఈ చిత్రంలో ఆయన డిప్యూటీ కలెక్టర్‌గా నటిస్తున్నారు. ఆ స్థాయిలో ఉన్నా సింపుల్ గా ఉంటూ... ప్రజల పక్షం నిలబడే వ్యక్తిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 
 
ఆయుధంపై ఆధారపడే నీలాంటి వాడి ధైర్యం.. వాడే ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువున ఉంటుందనే డైలాగ్ అదిరింది.
 
శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ సందడి చేయనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కాబోతుంది.