బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (16:05 IST)

రవితేజ న‌టించిన రామారావు ఆన్ డ్యూటీ తాజా అప్‌డేట్‌

Raviteja poster
రవితేజ  యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉంది. సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ LLP మరియు RT టీమ్‌వర్క్స్‌పై రూపొందుతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ లాంచ్ తేదీని మేకర్స్ ఖ‌రారు చేశారు. రామారావు ఆన్ డ్యూటీ టీజర్ మార్చి 1వ తేదీన మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదల కానుంది. పోస్టర్‌లో రవితేజ ఆక‌ట్టుకునేలా స‌రికొత్త గెట‌ప్‌లో కనిపించారు.
 
వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సంగీతం సామ్ సిఎస్ అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్సి కెమెరా క్రాంక్ చేశారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్.
 
యదార్థ సంఘటనల నుండి స్పూర్తి పొందిన కథ, సినిమా ప్రచార కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
 
నటీనటులు: రవితేజ, దివ్యషా కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
 
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు & దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్ LLP, RT టీమ్‌వర్క్స్
సంగీత దర్శకుడు: సామ్ సిఎస్
DOP: సత్యన్ సూర్యన్ ISC
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
PRO: వంశీ-శేఖర్