గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (10:30 IST)

మేనేజర్ శ్రీను ఇంట సందడి చేసిన మాస్ మహారాజ

మాస్ మహారాజ రవితేజ హైదరాబాద్‌లోని తన మేనేజర్ శ్రీను ఇంట జరిగిన వేడుకలో సందడి చేశారు. రవితేజ మేనేజర్ శ్రీను కుమార్తె ఫంక్షన్‌కు రవితేజతో పాటు తేజ సజ్జా, భరత్ జీ, సునీల్, రామ్ లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. ఈవెంట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ రెండవ షెడ్యూల్ షూటింగ్‌ని ఇటీవలే ప్రారంభించాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో స్టంట్ డైరెక్టర్లు రామ్, లక్ష్మణ్ తెరకెక్కిస్తున్న కొన్ని ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలపై చిత్రీకరణ జరుగుతోంది.
 
ఇక ‘ధమాకా’ విషయానికొస్తే. ‘పెళ్లి సందడి’ ఫేమ్ నటి శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ రైటర్‌గా ప్రసన్న కుమార్ బెజవాడ, కంపోజర్‌గా భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్ ఘట్టమనేని ఉన్నారు. మేకర్స్ ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు. 
 
మరోవైపు శరత్ మండవ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, మార్చి 25న థియేటర్లలోకి రానుందని సమాచారం.