1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (20:19 IST)

హైదరాబాద్‌‌లో కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌ 6వ ఎడిషన్‌ను ప్రారంభించిన ఇన్‌స్టాగ్రామ్‌

ఇన్‌స్టాగ్రామ్‌ సంస్ధ, యంగ్‌ లీడర్స్‌ ఫర్‌ యాక్టివ్‌ సిటిజన్‌షిప్‌ (వైఎల్‌ఏసీ) భాగస్వామ్యంతో తమ ప్రతిష్టాత్మక యూత్‌ ప్రోగ్రామ్‌-కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌ ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. వరుసగా ఆరవ సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తమకు ఆసక్తి కలిగిన అంశాలలో పాల్గొనవచ్చు, ఆ అంశాలను గురించి ఆన్‌లైన్‌లో చర్చించడాన్ని సైతం ఇది ప్రోత్సహిస్తుంది.

 
ఈ కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌, సృజనాత్మక యువతతో అనుబంధం ఏర్పరుచుకోవడంతో పాటుగా విజువల్‌ స్టోరీ టెల్లింగ్‌ శక్తిని వినియోగించుకుని అర్థవంతమైన సంభాషణలను ప్రపంచ వ్యాప్తంగా యువతకు అత్యంత కీలకమైన అంశాల పట్ల జరిగేందుకు ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని సానుకూల వ్యక్తీకరణ మరియు ప్రచారం కోస కళలను వినియోగించుకోవాలనే ఆలోచనతో నిర్మించబడింది. భావి తరపు నాయకులు, ఉద్యమకారుల కోసం ఇంక్యుబేటర్‌గా ఇది రూపొందించబడింది.


గతంలో జరిగిన కార్యక్రమాలలో పాల్గొన్న వారి నుంచి లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలైనటువంటి గ్లోబల్‌ వలెంటరీ యాక్షన్‌ నెట్‌వర్క్‌ వంటివి న్యాయ హక్కులపై దృష్టి సారించిన న్యాయ, ఎల్‌జీబీటీక్యుఐఏ హక్కుల కోసం పోరాడు కీర్‌ ముస్లిమ్‌ ప్రాజెక్ట్‌ వంటి వాటితో కలిసి పనిచేస్తుంది. ఇప్పుడు, 2022లో ఈ ఫెలోషిప్‌ నాలుగు ముఖ్య నేపథ్యాలు- లింగ సమానత్వం, వైవిధ్యత, వేధింపులు మరియు మానసిక సంక్షేమం వంటి అంశాలపై దృష్టి సారించింది.

 
ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ మేనేజర్‌ నటాషా జోగ్‌ మాట్లాడుతూ, ‘‘ప్రజలు సృజనాత్మకంగా తమను తాము వ్యక్తీకరించుకునే ప్రాంగణం ఇన్‌స్టాగ్రామ్‌. ఈ తరహా సృజనాత్మకత వెలుపలికి రావాలంటే సానుకూల వాతావరణం కావాలి. ఈ కారణం చేతనే మేము వరుసగా ఆరవ సంవత్సరం ఫెలోషిప్‌ నిర్వహిస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా యువత ఈ ఫెలోషిప్‌లో భాగం కావడంతో పాటుగా సృజనాత్మక సమాజంలో భాగం కావచ్చు. ఈ సమాజం యువత అభిప్రాయాలను వెల్లడించడంతో పాటుగా సామాజిక మార్పుకు సైతం ప్రచారం చేస్తుంది. వైఎల్‌ఏసీ, తల్లిదండ్రులు, యువతతో భాగస్వామ్యం కొనసాగించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. వీరే తమ సమయం, శక్తిని వినియోగించడంతో  పాటుగా ఈ ఫెలోషిప్‌ను యువత డిజిటల్‌ వృద్ధిలో అత్యంత కీలకంగా మారుస్తుంది’’ అని అన్నారు.

 
వైఎల్‌ఏసీ కో-ఫౌండర్‌ రోహిత్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘‘తొలుత మేము కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌ను ఆవిష్కరించినప్పుడు దాదాపు 1100 మంది ప్రతిభావంతులు, అభిరుచి కలిగిన ఫెలోస్‌ సోషల్‌ మీడియా శక్తిపై ఆధారపడి వైవిధ్యతతో కూడిన ప్రపంచం సృష్టించేందుకు తోడ్పడింది, అవసరమైన వారికి తగిన మద్దతునూ అందించింది. ఎంతో మంది ఫెలోస్‌ తమంతట తాముగా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా ఈ కార్యక్రమం వెలుపల నుంచి తమ కుటుంబ సభ్యులు, తమ పాఠశాలలు, కమ్యూనిటీ నుంచి తమ రచనలు, వెబినార్‌లు, ఇన్ల్ఫూయెన్సర్‌లు, విధాన నిర్ణేతలు, సుప్రసిద్ధ పౌర సమాజ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌తో మా భాగస్వామ్యం కొనసాగుతుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. భారతదేశంలో మరింత మంది యువతకు చేరువ కావాల్సిన అతి ముఖ్య కార్యక్రమమిది’’ అని అన్నారు.

 
శ్రేయ సక్సేనా, ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, హైదరాబాద్‌, సీఎస్‌ఎఫ్‌ 2020 మాట్లాడుతూ, ‘‘దేశవ్యాప్తంగా టీనేజర్లతో సంభాషణలను జరిపేందుకు నాకు తోడ్పడిన కార్యక్రమమిది. అతి ముఖ్యమైన అంశాలను అన్వేషించేందుకు, నా అంతట నేను అవగాహన మెరుగుపరుచుకునేందుకు, అవగాహన విస్తరించేందుకు, నా సృజనాత్మను కనుగొనేందుకు సైతం ఇది తోడ్పడింది. సోషల్‌ మీడియా అద్భుతాలను నాకిది పరిచయం చేసింది. అదే సమయంలో ప్రభావవంతంగా ప్రచారం చేసేందుకు సైతం ఇది తోడ్పడింది. మొత్తంమ్మీద, ఈ ఫెలోషిప్‌ నాకు అత్యంత విలువైన స్నేహాలను అందించడంతో పాటుగా ప్రశ్నలు లేవనెత్తడం మాత్రమే కాదు చక్కటి శ్రోతగానూ తీర్చిదిద్దింది’’ అని అన్నారు.

 
ఈ ఫెలోషిప్‌ను పూర్తి స్ధాయిలో ఫండింగ్‌ కలిగిన ఎంగేజ్‌మెంట్‌గా తీర్చిదిద్దారు. ఇక్కడ ఫెలోస్‌ వారం విడిచి వారం పలు గంటలు కలుసుకుంటారు. ఈ ఫెలోషిప్‌ మొత్తం వ్యవధి రెండు నెలలు. గత నాలుగు సంవత్సరాలుగా ఇది వర్ట్యువల్‌ ఎంగేజ్‌మెంట్‌గా ఇది తీర్చిదిద్దబడింది. అన్ని సెషన్‌లనూ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని 13-18 సంవత్సరాల విద్యార్ధుల కోసం నిర్వహిస్తున్నారు.భారతదేశ వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులు వీటిలో పాల్గొనవచ్చు. దీనిలో పాల్గొనేందుకు దరఖాస్తులు చేరాల్సిన చివరి తేదీ మే 13,2022.

 
2017లో  ప్రారంభించిన కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌ అప్పటి నుంచి 80 నగరాలలోని యువత నుంచి పార్టిస్పేషన్‌ చూస్తుంది. ఈ ఫెలోస్‌ సృష్టించిన కంటెంట్‌ 17 మిలియన్‌లకు పైగా విద్యార్థులకు చేరువయింది. ఇటీవలనే, ఇన్‌స్టాగ్రామ్‌ రోలవుట్‌ ఫీచర్‌ను సైతం పరిచయం చేసింది. టేక్‌ ఏ బ్రేక్‌గా పిలువబడుతున్న ఈ ఫీచర్‌తో ప్రజలు నిర్ధిష్ట సమయం పాటు  స్ర్కోలింగ్‌ చేస్తున్నట్లయితే వారిని ఇన్‌స్టాగ్రామ్‌కు కాస్త విరామం తీసుకోవాల్సిందిగా కోరుతుంది. అంతేకాదు, భవిష్యత్‌లో మరిన్ని బ్రేక్స్‌ కోసం రిమైండర్లను సైతం నిర్ధేశించేలా రిమైండర్లను పెట్టవలసినదిగా కోరుతుంది.