ఆంటీ లవర్స్ జాగ్రత్తరా బాబు, సోషల్ మీడియాలో వీడియో
కొంతమంది టీనేజ్ అబ్బాయిలు తప్పుదారి పడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల వీడియోలు వస్తున్నాయి. చదువు కోసం అనో, ఫ్రెండ్ ఇంటికి వెళ్లి స్టడీస్ అనో, పార్టీలనో... ఇలా వెళ్లినవారు కొంతమంది పెళ్లయిన వివాహితలతో ప్రేమాయణం సాగిస్తున్నారనీ, ఆ తర్వాత వారితో పాటు వారి తల్లిదండ్రులకు కూడా పీకల్లోతు కష్టాలను తెచ్చిపెడుతున్నారంటూ మానసిక విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
తమ దృష్టికి ఇలాంటి కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. వివాహితతో పెళ్లికాని అబ్బాయి రిలేషన్ పెట్టుకుంటే వారి జీవితాలతో పాటు వారితో వున్నవారి జీవితాలు కూడా నాశనమవుతున్నాయనీ, కొన్ని కేసుల్లో రిలేషన్ పెట్టుకున్న వివాహితలను వదిలించుకునేందుకు అబ్బాయిలు నేరాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు.
ఇంకొన్ని కేసుల్లో వివాహితతో సంబంధం పెట్టుకున్నందుకు సదరు మహిళ అతడిని బ్లాక్ మెయిల్ చేస్తున్న సందర్భాలు వుంటున్నాయని అంటున్నారు. అందువల్ల టీనేజ్ వయసుకి వచ్చిన పిల్లల స్నేహాలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తుండాలని హెచ్చరిస్తున్నారు.
Aunty lovers jagratha ra babu https://t.co/XJ2RfDHnu6
— (@eshwar_stylish) November 12, 2026

