అస్సాం రైలు ప్రమాదం, పనిచేయని రైలు బ్రేకులు, అందుకే ప్రమాదం, వీడియో
రోడ్లపై తిరిగే వాహనాల బ్రేకులు ఫెయిలయ్యాయని, అందువల్ల ప్రమాదం సంభవించిందని మనం వింటుంటాం. కానీ అస్సాంలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం రైలు బ్రేకులు ఫెయిల్ అవ్వడమేనని చెబుతున్నారు. రైలు ఇంజిన్ లోపల బ్రేకులు వేసేందుకు లోకో డ్రైవర్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ అవి పనిచేయలేదు. దీనితో అతడు నిస్సహాయంగా అలా చూస్తుండిపోయాడు. దాంతో రైలు పట్టాలు తప్పి ప్రమాదం చోటుచేసుకున్నదని తెలుస్తోంది.
Around 50 Passengers are said to have been injured after Kolkata-Sairang Express derailed in Assam Footage from inside the engine #RailwayAccident #TrainAccident #Assam #AssamTrainAccident https://t.co/02XNe0Xogm
— India Strikes YT(@IndiaStrikes_) November 11, 2026
కోల్‌కతా - సైరంగ్ ఎక్స్‌ప్రెస్ రాష్ట్రంలోని కామ్‌రూప్ జిల్లాలోని డిగార్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది. ప్రయాణికులు ఉన్న ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. దీనిపై నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సీపీఆర్వో మాట్లాడుతూ ఈ ఘటన గురువారం ఉదయం 6.54 సమయంలో చోటుచేసుకొన్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఇప్పటికే సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గౌహతికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇంజిన్‌తో సహా ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గౌహతి స్టేషన్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే రైలు ప్రమాదానికి గురైంది. ఈ రైలు మంగళవారం ఉదయం కోల్‌కతా స్టేషన్ నుంచి బయల్దేరింది. ఇది నేటి మధ్యాహ్నానికి మిజోరంలోని సైరంగ్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ రైలు ఒక లైన్ నుంచి మరో లైన్‌కు మారుతున్న సమయంలో బ్రేకులు పనిచేయకపోవడంతో అది ప్రమాదానికి కారణమైందని అంటున్నారు. దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.

