1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Five-Year-Old Girl Kidnapped and Assaulted in Uttar Pradesh

తాత బైకుపై వెళుతున్న బాలిక ... కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కామాంధుడు

victim
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన తాతతో కలిసి బైకుపై వెళుతున్న ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఓ కామాంధుడు ఆ బాలికను కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు తక్షణం స్పందించిన యూపీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జూన్ 11వ రాత్రి బాన్సడీ రోడ్డు కూడలి దాటిన తర్వాత ఓ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. బాలిక అత్యవసర పని నిమిత్తం తన మోటార్ సైకిల్‌ను రోడ్డు పక్కన ఆపాడు. అదేసమయంలో వేరే బైకుపై అక్కడికి వచ్చిన నిందితుడు చందన్ కుమార్ షా (29) బైకుపై కూర్చుని ఉన్న ఐదేళ్ల చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ షాకింగ్ ఘటనపై బాలిక తండ్రి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. 
 
ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు అదే రోజున చిన్నారిని నిందితుడి బారి నుంచి రక్షించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలికపై లైంగికదాడి జరిగినట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టంలోని కఠిన నిబంధనల కింద కేసులు నమోదు చేశారు. శనివారం ధేలహ్వా బాబా నుంచి దుభద్ వెళ్లే రహదారి సమీపంలో నిందితుడు చందన్ కుమార్ షాను అరెస్టు చేసి, నేరానికి  వాడిన బైకును సీజ్ చేశారు. 
About Writer
ఠాగూర్