1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Gandhi Hospital rape accused statement

గాంధీ ఆసుపత్రి అత్యాచార నిందితుడు: ఆమె ఇష్టంతోనే చేశా

Gandhi Hospital
గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై అత్యాచార ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో కనిపించకుండా పోయిన సెక్యూరిటి గార్డు విజయ్ కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బాధితురాలిపై అత్యాచారం చేశానని ఒప్పుకున్నాడు. కాగా నిందితుడు విజయ్ స్వస్థలం కాజిపేట్ అనీ, అతడికి 8 ఏళ్ల క్రితం పెళ్ళయిందని పోలీసులు తెలిపారు. గత నెల 27న గాంధీ ఆసుపత్రిలో సెక్యురిటి గార్డ్‌గా చేరిన ఇతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
 
పోలీసుల విచారణలో అతడు బాధితురాలి ఇష్టపూర్వకంగానే తను అలా చేసినట్లు చెప్పాడు. మరోవైపు కనిపించకుండా పోయిన మహిళ గురువారం ఉదయం నారాయణగూడ మెయిన్ రోడ్ వద్ద మెడికల్ షాప్ ముందు గుర్తించి ఆమెను పోలీసు స్టేషనుకు తరలించారు.
 
తర్వాతి కథనం
కేసీఆర్ ఊఁ.. అంటే చాలు.. 300 కిమీ లోతుకు తొక్కేస్తాం : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి