మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: శనివారం, 14 ఆగస్టు 2021 (19:15 IST)

కొడుకు స్నేహితుడే కదా అని చేరదీస్తే అత్యాచారం చేశాడు

స్నేహితుడి తల్లిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. కొడుకు స్నేహితుడిని ఆమె కొడుకుతో సమానంగా చూసింది. అయితే అతడు మాత్రం అలా అనుకోలేదు. భర్త లేని ఆమెను తనవైపు తిప్పుకోవాలని చూశాడు. ఒప్పుకోకపోవడంతో అత్యాచారానికి ఒడిగట్టాడు.
 
కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా నవైక్కుళంలో నివాసముంటున్న 44 సంవత్సరాల మహిళ భర్తను కోల్పోయింది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ మహిళ కొడుకు రాజేష్, ప్రదీప్‌లు ఇద్దరూ స్నేహితులే. ఎప్పుడూ కలిసే ఉండేవారు. కరోనా సమయంలోను ఇద్దరూ కలిసి ఉన్నారు. 
 
ఒకరంటే ఒకరికి ప్రాణం. దీంతో రాజేష్‌తో సమానంగా ప్రదీప్‌ను భావించింది మహిళ. కానీ ప్రదీప్ మాత్రం తనలోని కామాంధుడిని బయటపెట్టాడు. రెండురోజుల క్రితం ప్రదీప్, రాజేష్ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అయితే రాజేష్‌ను మరికొంతమంది స్నేహితులతో వాళ్ల ఇంటికి పంపించేశాడు ప్రదీప్. 
 
నేరుగా రాజేష్ ఇంటికి వచ్చి అతని తల్లితో బాధపడుతూ నీ కొడుకు ఎక్కువగా తాగి పడిపోయాడంటూ వెంటనే రావాలంటూ  చెప్పాడు. ప్రదీప్ అసలు స్వరూపం తెలియని ఆమె అతనితో పాటు వెళ్ళింది. బైక్ పైన తీసుకెళ్ళిన ప్రదీప్ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమెను వదిలి పారిపోయాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి మహిళ కొడుకు సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.