శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 14 ఆగస్టు 2021 (12:00 IST)

అమెరికా వెళ్లి నువ్వెంత సంపాదిస్తావ్, నావద్దకొచ్చేయ్: 6 నెలలు వాడుకుని ఫోన్ స్విచాఫ్

ఆన్ లైన్ ప్రేమాయణం. యువతిని బాగా నమ్మించి మోసం చేసాడు ఓ యువకుడు. హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన ఓ యువతికి ఆదిత్య అనే యువకుడు ఆన్లైన్లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా మెల్లగా స్నేహంగా మారింది. ఆ తర్వాత రేయింబవళ్లు ఫోన్లు చేస్తూ ఆమెని పూర్తిగా దింపేశాడు. దాంతో ఆమె నెలరోజుల పాటు అతడితో సహజీవనం చేసింది.
 
బీటెక్ పూర్తి కావడంతో అమెరికా వెళ్లింది. అమెరికా వెళ్లాక కూడా అతడు వదల్లేదు. తరచూ ఫోన్లు చేస్తూ..  తనకు బెంగళూరులో 13 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు వున్నాయనీ, కోట్ల రూపాయల ఆస్తులు వున్నాయంటూ నమ్మించాడు. అమెరికా ఎన్నాళ్లకు నువ్వు ఈ డబ్బు సంపాదిస్తావనీ, నా దగ్గరకు వచ్చేస్తే పెళ్లి చేసుకుని హాయిగా వుందామని ఒత్తిడి చేసాడు. 
 
అతడి మాటలు నమ్మిన యువతి అమెరికా నుంచి గత ఫిబ్రవరి హైదరాబాద్ వచ్చేసింది. దాంతో ఆమెను తీసుకుని పలు ప్రాంతాల్లో టూర్లకు వెళ్లాడు. అలా బాగా ఎంజాయ్ చేసి జూలై నెలలో నగరానికి వచ్చాడు. బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు తీసుకున్నారు.
 
ఆ తర్వాత బెంగళూరు వెళ్లి డబ్బు తీసుకుని వస్తానని చెప్పి పత్తా లేకుండా పోయాడు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోంది. దీనితో తను మోసపోయానని గ్రహించిన యువతి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.