శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి

ఒకే వ్యక్తితో తల్లీ కూతుళ్ల రాసలీలలు.. బయటికి తెలిసే సరికి..?

కాన్పూర్ పరిధి కోహానాలో దారుణం జరిగింది. ఒకే వ్యక్తితో తల్లీ కూతుళ్ల రాసలీలను బయట పెట్టిన వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కోహానా ప్రాంతంలో తల్లి, కూతురు, కొడుకు ఉంటున్నారు. కొడుకు భరత్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే కొడుకు లేని సమయంలో రంజిత్ అనే వ్యక్తితో తల్లి చనువుగా ఉంటున్నారు. 
 
అంతేకాదు ఆమె కూతురు కూడా రంజిత్‌తో ప్రేమలో ఉన్నారు. తరచూ రంజిత్ ఇంటికి వస్తుండటంతో కొడుకు భరత్ కు అనుమానం వచ్చింది. దీంతో భరత్ స్నేహితుడు నవీక్‌కు ఈ విషయాన్ని చెప్పారు. ఏం జరుగుతుందో తనకు చెప్పమన్నాడు. స్నేహితుడి విజ్ఞప్తి మేరకు నవీన్.. తల్లీ కూతుళ్లపై నిఘా పెట్టి అసలు విషయం భరత్‌కు చెప్పారు.
 
అయితే నవీన్ నిఘా పెట్టిన విషయం తల్లికూతుళ్లకు తెలిసిపోయింది. దీంతో నవీన్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. నవీన్‌తో మాట్లాడాలని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం రంజిత్ అక్కడ ఉన్నారు. రంజిత్ ను చూసి నవీన్ తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ముగ్గురూ కలిసి నవీన్‌ను గొంతు నులిమి అత్యంత దారుణంగా చంపేశారు. అనంతరం పారిపోయారు.
 
నవీన్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులకు విస్తు పోయే నిజాలు తెలిశాయి. దీంతో రంజిత్‌తో పాటు తల్లీకూతళ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.