శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (10:43 IST)

మహేష్ బాబు ముద్దుల కుమార్తె 9వ పుట్టినరోజు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార తన 9వ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం జరుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజు తో సితార తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదేళ్లలోకి అడుగుపెడుతోంది. 
 
ఇక ఇప్పటికే సితార సెలబ్రిటీ అయిన సంగతి తెలిసిందే. సితార చేసే డాన్సులు ఇతర వీడియోలను నమ్రత ఎప్పుడూ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలా సితార బుల్లి సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాకుండా మహేష్ బాబు అభిమానులు సీతారను ఎంతో ఇష్టపడతారు. క్యూట్ క్యూట్ గా ప్రతి ఒక్కరిని సితార ఆకర్షిస్తుంది.
 
మరోవైపు, సితార కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించాలని మహేష్ బాబు అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇదివుంటే, సీతార పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ చేశారు. 
 
"నా చిన్ని తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడు నా ప్రపంచాన్ని వెలిగిస్తూనే ఉండు. నువ్వు అంచనా వేయనంత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను" అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీతార బెలూన్‌లతో ఆడుకుంటున్న ఫోటోను మహేష్ బాబు షేర్ చేశారు.