మొదటి భార్య ఉండగానే రెండవ పెళ్ళి చేసుకుని ఎంజాయ్ చేశాడు, కానీ?
మొదటి భార్య బతికే ఉంది.. కానీ రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ఆమెతో కొంతకాలం గడిపాడు. ఆమె అనారోగ్యం గురికావడంతో తిరిగి మొదటి పెళ్ళాం దగ్గరకు వచ్చేశాడు. ఉన్నఫలంతా వదిలేయడంతో రెండవ భార్య ఆవేదనకు గురైంది. మొదటి భార్య దగ్గరకు మళ్ళీ భర్త వెళ్ళాడని జీర్ణించుకోలేక ధర్నాకు దిగింది.
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో నివాసముంటున్న మేఘన ఉన్నత చదువులు చదివింది. తమిళనాడు నుంచి మదనపల్లెకు వచ్చిన అంబురాజు అనే వ్యక్తి పానీపూరీ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆ యువతికి అంబురాజుతో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్త వీరిద్దరిని బాగా దగ్గర చేసింది. తనకు పెళ్ళే కాలేదని మొదట్లో అంబురాజు చెప్పారు. అయితే అప్పటికే అతనికి వివాహమై ఒక కొడుకు కూడా ఉన్నాడు. మొదటి భార్యను తన స్వగ్రామంలో వదిలి అప్పుడప్పుడు వెళ్ళివచ్చేవాడు అంబురాజు. ఆ విషయం తెలియని యువతి అతని మాయమాటలు నమ్మింది.
అతనికి సర్వస్వం అర్పించింది. ఆ తరువాత పెద్దలు తెలియకుండా అంజురాజుతో వచ్చి వివాహం చేసేసుకుంది. పెద్దలు ఒప్పుకోకపోగా ఆమెను ఇంటి నుంచి పంపేశారు. రెండునెలల పాటు అంజురాజుతోనే ఆమె ఉండేది. అయితే ఉన్నట్లుండి ఆమె అనారోగ్యానికి గురికావడం.. రెండు కిడ్నీలు చెడిపోవడం జరిగింది.
డయాలసిస్‌కు అవసరమైన డబ్బులు పెట్టలేని అంబురాజు తన దుర్భిద్దిని బయటపెట్టాడు. రెండవ భార్యను వేధించేవాడు. అంతేకాదు తనకు వివాహం జరిగి కొడుకు ఉన్నాడన్న విషయాన్ని కూడా చెప్పేశాడు. దీంతో ఆవేదనతో ఆమె తన పుట్టింటికి వెళ్ళింది.
అక్కడే ఉంటూ డయాలసిస్ చేసుకుంటూ ఉండేది. అయితే నిన్న మధ్యాహ్నం మొదటి భార్యను మదనపల్లెకు తీసుకొచ్చాడు అంబురాజు. విషయం తెలిసిన రెండవ భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ప్రాధేయపడింది. ప్రస్తుతం పోలీసులు వీరిని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.