బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 18 ఆగస్టు 2021 (22:35 IST)

ఆటోడ్రైవర్లు ఘాతుకం, 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. కొందరు ఆటోడ్రైవర్లు 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాదులోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. సైదాబాద్ పరిధిలోని సంతోష్ నగర్‌లో 20 ఏళ్ల యువతిని కొందరు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసారు. ఆ తర్వాత ఆమెను పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసారు. తనపై జరిగిన అఘాయిత్యంపై యువతి సంతోష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలు చెప్పిన ప్రాంతంలో సీసీ కెమేరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడపడుతున్నారు.