గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (11:02 IST)

ఆశ్లీల చిత్రాలు చూసేందుకు నిరాకరించిన ఆరేళ్ల బాలిక.. కొట్టి చంపిన వైనం..

తమతో కలిసి అశ్లీల చిత్రాలు, వీడియోలు చూసేందుకు నిరాకరించిన ఆరేళ్ళ బాలికను ముగ్గురు మైనర్ బాలలు దారుణంగా కొట్టి చంపేశారు. ఈ దారుణం అస్సాం రాష్ట్రంలోని నగావ్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కలియబర్ పట్టణ పరిధిలోని మిస్సా గ్రామానికి చెందిన 11 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు బాలలు అశ్లీల చిత్రాలు చూసేందుకు అలవాటుపడ్డారు. ఈ ముగ్గుర బాలల్లో ఒకరు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు అతడి తండ్రి తన స్మార్ట్‌ఫోన్ ఇచ్చాడు. 
 
అందులో అప్పటికే అతడు డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్న లెక్కలేనన్ని నీలి చిత్రాలు ఉన్నాయి. మిగతా ఇద్దరు స్నేహితులతో కలిసి బాలుడు వాటిని చూడడాన్ని అలవాటు చేసుకున్నాడు. వీటిని చూసేందుకు తన ముగ్గురు స్నేహితులతో కలిసి గ్రామంలోని క్వారీ వద్దకు వెళ్లారు. అక్కడకు అదే గ్రామానికి చెందిన ఆరేళ్ళ బాలికను కూడా తమ వెంట తీసుకెళ్లారు. 
 
అక్కడ తమతోపాటు తెచ్చిన సెల్‌ఫోన్‌లోని నీలి చిత్రాలను చూడాలని బాలికను ఒత్తిడి చేశారు. అందుకు చిన్నారి నిరాకరించడంతో కోపంతో పక్కనే ఉన్న రాళ్లతో ఆమెను కొట్టి చంపేశారు. దీనిపై మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించారు. 
 
క్వారీలోని మరుగుదొడ్డి వద్ద బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. నేరాన్ని దాచేందుకు యత్నించిన నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా అరెస్ట్ చేశారు.