ఇది iPhone కోసం ఆత్మహత్య కాదు, వెనుక ఏదో వుంది...
మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో తల్లిదండ్రులు తమ కుమారుడితో కలిసి లోయలో పడి ప్రాణాలు తీసుకున్న హృదయ విదాకర ఘటనకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత ఇది iPhone ఇఎంఐ కట్టడానికి సంబంధించి తలెత్తిన గొడవ అనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఐతే వారి ఆత్మహత్యలకు కారణం అది కాదని వారి బంధువులు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ ఆత్మహత్యల వెనుక వున్న కారణాలు ఏమిటన్నది పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాల్సి వుంది.
మరోవైపు ఆత్మహత్యకు పాల్పడే ప్రదేశం వద్ద, అక్కడే ఉన్న తన కుమారుడిని తిరిగి వచ్చేలా ఒప్పించడానికి ఆ తల్లి కన్నీళ్లతో ఎంతగానో ప్రాధేయపడింది. 'నీ కోసం నా మంగళసూత్రాన్ని కూడా తీసేస్తాను, నీ నాన్నను వదిలేసి నీతోనే ఉంటాను, నన్ను వదిలి వెళ్ళకు' అంటూ బోరున విలపించింది. అయినప్పటికీ కుమారుడు వినకపోవడంతో, చివరకు ఆ ముగ్గురూ లోయలో పడి ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
The iPhone Story Might Not Be the Whole Truth
— Chota Don (@choga_don) August 24, 2026
My heart can't believe that such a sanskari boy can't do something like that just for an iPhone.
The exact circumstances surrounding the deaths should ultimately be established through police investigation, official records, and… pic.twitter.com/llmZbNE0sI

