సంబంధిత వార్తలు
- నమో భారత్ రైళ్లు, స్టేషన్లలో పుట్టినరోజు, ప్రీ-వెడ్డింగ్ షూట్లను జరుపుకోవచ్చు..
- ఢిల్లీ ప్రజలకు ఊపిరాడటం లేదు.. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
- రెండో భర్తను చంపిన కేసులో విడుదలైన భార్యను కాల్చి చంపిన మూడో భర్త (video)
- Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !
- భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?
తరగతి గదిలో విద్యార్థినిని తుపాకీతో కాల్చి తాను కాల్చుకున్న విద్యార్థి.. ఎక్కడ?
పంజాబ్ రాష్ట్రంలోని తరన్ తారన్ జిల్లాలో ఓ అత్యంత దారుణ ఘటన జరిగింది. సోమవారం ఓ యువకుడు తన వెంట తెచ్చుకున్న తుపాకీతో సహ విద్యార్థినిని తరగతి గదిలోనే కాల్చాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో విద్యార్థినిని ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు మాత్రం తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ భయానక దృశ్యాలన్నీ తరగతి గదిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మృతురాలిని నౌషెహ్రా పన్నువాన్ గ్రామానికి చెందిన సందీప్ కౌర్‌గా, నిందితుడుని జలంధర్ జిల్లా మల్లియాన్ గ్రామానికి చెందిన ప్రిన్స్ రాజ్‌గా గుర్తించారు. వీరిద్దరూ ఉస్మా గ్రామంలోని ఒక లా కాలేజీలో మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజీ అధారంగా ఉదయం 9.15 గంటల సమయంలో ప్రిన్స్ రాజ్ తరగతి గదిలోకి ప్రవేశించాడు. అతన్ని చూసిన సందీప్ కౌర్.. ఏదో కామెంట్స్ చేయగా, ఆమె వెనుకనే అతను వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికే తన బ్యాగులో నుంచి తుపాకీ తీసి నిలబడి వున్న సందీప్ కౌర్ తలలో కాల్చాడు. ఆ తర్వాత కొన్ని అడుగులు ముందుకు వేసి తన తలలోకి కూడా కాల్చుకున్నాడు. ఈ ఊహించని ఘటనతో తోటి విద్యార్థులు షాక్‌కు గురై పరుగులు ప్రాణభయంతో తరగతి గది నుంచి పరుగులు తీశారు.
ప్రిన్స్రాజ్ ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడుని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తామని అధికారులు పేర్కొన్నారు.
