1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Team Thackeray Leader Shot Dead On Facebook Live, Attacker Later Kills Self

లైవ్ స్ట్రీమింగ్‌కు ఆహ్వానించి... శివసేన యూబీటీ నేత కాల్చివేత.. నిందితుడు కూడా...

gunshot
లైవ్ స్ట్రీమింగ్‌కు ఆహ్వానించిన శివసేన పార్టీకి చెందిన యూటీబీ నేతను కాల్చివేశారు. ఆ తర్వాత నిందితుడు కూడా అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఈ దారుణ ఘటన ముంబైలోని దహిసార్ ప్రాంతంలో జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని అభిషేక్‌గా ఘోసాల్కర్‌గా గుర్తించారు. ఈయన మహారాష్ట్ర శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఓ కీలక నేత కుమారుడు కావడం గమనార్హం. అతడిని లైవ్ స్ట్రీమ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానించి నిందితుడు మారిస్ నోరాన్హా. అభిషేక్‌ను తుపాకీతో కాల్చిన నోరాన్స్.. ఆ తర్వాత అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ముంబై దహిసార్ ప్రాంతంలోని ఎం.హెచ్.బి. పోలీస్స స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ వినోద్ ఘోసాల్కర్‌ కుమారుడే అభిషేక్. మారిస్‌తో అతనికి విభేదాలు ఉండగా, ఇటీవలే వాటిని పరిష్కరించుకుని రాజీకి వచ్చారు. ఆ తర్వాత లైవ్ స్ట్రీమింగ్‌కు అభిషేక్‌ను ఆహ్వానించిన మారిస్.. ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. కాగా, ఇటీవల ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన మహేశ్ గైక్వాడ్‌పై ఓ బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు తెగబడిన విషయం తెల్సిందే. ఈ ఘటన మరిచిపోకముందే ఇపుడు మరో హత్య జరగడం గమనార్హం. 
తర్వాతి కథనం
మానవుడి మెదడులో న్యూరాలింక్ చిప్.. ఆశాజనక ఫలితాలు : ఎలాన్ మస్క్ వెల్లడి