బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (12:29 IST)

విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారం.. ఎక్కడ?

victim woman
ఓ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు క్యాన్సర్ ఉందని మాయమాటలు చెప్పి... విద్యార్థినిని లోబరుచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో వెలుగుచూసింది. ఈ యూనివర్శిటీలో అజయ్ కుమార్ అనే వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. తన వద్ద చదువుకునే ఓ విద్యార్థికి ప్రేమ పేరుతో దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. ఆమె వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో తన పంథాను మార్చుకున్నాడు. 
 
తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు బాధితురాలిని ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. ఆ సాకుతో ఆమెతో తరచుగా మొబైల్‌లో మాట్లాడసాగాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన విద్యార్థినిని తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు యూనివర్శిటీ యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ విజ్ఞప్తి చేసింది. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేయాలంటూ యూనివర్శిటీ విద్యార్థులంతా ఒత్తిడి చేయడంతో అజయ్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్టు డీసీపీ దీపక్ భుకర్ వెల్లడించారు. అయితే, నిందితుడిని అరెస్టు చేయకపోవడాన్ని ఖండిస్తూ విద్యార్థులు యూనివర్శిటీలో ఆందోళన చేస్తున్నారు.