సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (15:48 IST)

శబరిమలలో భక్తుల రద్దీ- ట్రావెన్ కోర్ దేవస్థానం కీలక నిర్ణయం

sabarimala devotees
శబరిమలలో భక్తుల రద్దీ విషయంలో దేవస్థానం ట్రస్ట్‌ (ట్రావెన్‌కోర్‌ దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతి సందర్శనం రోజున దర్శనాలపై కొత్త నిబంధనలను విధించింది. మకరజ్యోతి వీక్షణం కోసం 50వేల మందికే అనుమతి ఇస్తామని ట్రస్ట్‌ పేర్కొంది. మకరజ్యోతి దర్శనానికి మహిళలు, పిల్లలు రావొద్దని అలర్ట్ చేసింది. 
 
అలాగే ఈ నెల 14వ తేదీన 40వేల మందికి, 15వ తేదీన 50వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు ట్రస్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ రెండు రోజుల్లో ఆన్ లైన్ బుకింగ్ చేసుకున్న వారికే దర్శనం లభిస్తుందని దేవస్థానం స్పష్టం చేసింది. 
 
శబరిమలలో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. పంబా నుంచి శబరి పీఠం వరకు భక్తులు కిక్కిరిసిపోయారు. దీంతో గంటల తరబడి భక్తులు క్యూలైన్ లో వేచి వుండాల్సిన పరిస్థితి నెలకొంది.