ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (10:23 IST)

మంగళవారం తిరుమలలో పెరిగిన రద్దీ

tirumala
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి చూస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు ఆరుగంటల సమయం పడుతోంది.
 
టైమ్ స్లాట్ దర్శనానికి మూడు గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు నాలుగో రోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 
 
అయితే తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. వసతి గృహాల కోసం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. మంగళవారం అయినా రద్దీ మాత్రం కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
 
తిరుమల శ్రీవారిని 70,902 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,858 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.