శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-11-2023 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడం వల్ల సర్వదా శుభం...

Astrology
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక శు॥ పాఢ్యమి ప.2.20 అనూరాధ తె.4.09 ఉ.వ. 7.53 ల 9.30. ఉ.దు. 8. 19 ల 9.05 రా.దు. 10.28 ల 11.18.
 
ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కుటుంబంలో కలతలు తొలగి, ఐకమత్యంతో ఉంటారు. ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు అధికారులు సిఫార్సు చేస్తారు. పత్రికా రంగంలోని వారి సమర్థతకు ఏ మాత్రం గుర్తింపు ఉండదు.
 
వృషభం :- స్త్రీల ఆరోగ్యంలో కొంత పురోగతి కనిపిస్తుంది. భాగస్వామిక, సొంత వ్యాపారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పెట్టిపోతలు, ఒప్పందాల్లో పెద్దల సలహా తీసుకోవటం మంచిది. జీవితం అన్నాక అనేకమైన ఒడిదుడుకులు, సమస్యలు, సవాళ్లు తప్పవు. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో మెళకువ వహించండి. 
 
మిథునం :- మీ కృషిలో లోపం లేకుండా యత్నాలు సాగించండి, సత్ఫలితాలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలం. మొండి బాకీల వసూలుకు ఒకటికి రెండుసార్లు తిరగవలసి ఉంటుంది. మీ ప్రత్యర్థుల విమర్శలు, కుతంత్రాలు ధీటుగా ఎదుర్కుంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరికొంత సమయం పడుతుంది. 
 
కర్కాటకం :- మీ శక్తిసామర్ధ్యాలను ఎదుటివారు ఆలస్యంగా గుర్తిస్తారు. నేడు చేజారిన అవకాశం రేపు కలిసి వస్తుంది. వ్యాపారాల విస్తరణలకు లైసెన్సులు మంజూరవుతాయి. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావన నిరుత్సాహం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం చెందుతారు.
 
సింహం :- ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించకండి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబీకుల అభిప్రాయాలను తెలుసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు.
 
కన్య :- ఇంటా బయటా మీ ఆధిపత్యం కొనసాగుతుంది. ఉద్యోగస్తులు అధికారులకు మరింత చేరువవుతారు. అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు చక్కబెట్టుకుంటారు. స్త్రీలకు వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడి, ఆందోళనలకు లోనవుతారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాలకు అనుకూలం.
 
తుల :- ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఆస్తి పంపకాల విషయంలో సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ జీవితభాగస్వామి సలహా పాటించటం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. స్త్రీలు ఆత్మీయులతో దైవకార్యాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం :- అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో చికాకులు తప్పవు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకువస్తాయి. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్ములను వేధిస్తుంది. విద్యార్థులు తమ లక్ష్యసాధనకు బాగా శ్రమించాలి.
 
ధనస్సు :- ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. ఇతరులకు హితవు చెప్పబోయి వ్యతిరేకులవుతారు. ముఖ్యమైన వ్యవహారాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవటం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు.
 
మకరం :- వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత, ఆశించిన ఫలితం లేకపోవటం వంటి చికాకులు ఎదుర్కుంటారు. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాథి పథకాల దిశగా సాగుతాయి. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు తగినట్టుగానే ఉంటాయి. అవివాహితులకు శుభదాయకం.
 
కుంభం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. వాహనం ఇతరులకు ఇచ్చిఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మీనం :- ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగాలి. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ళ నుంచి ఆహ్వానం లభిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి.