శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-11-2023 ఆదివారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించినట్లైతే..

Lord Shiva
ఉమాపతిని ఆరాధించిన శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం:- మీకు తెలియకుండానే దుబారా ఖర్చులు చేస్తారు. బద్దకాన్ని వదలి చురుగ్గా ఉండండి. ఇవాల్టి పనులు రేపటికి వాయిదా వేయకండి. బంధువులను కలుసుకుంటారు. సొంత వ్యాపారాలు, విస్తరణలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతితో విందులు, వేడుకల్లో పాల్గొంటారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువుల చేజారి పోతాయి. 
 
వృషభం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన సమసిపోగలవు. వస్త్ర, బంగారు, వెండి, వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తప్పవు. ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య ఒక కొలిక్కివస్తుంది. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. విద్యార్ధినులలో ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు. 
 
మిథునం :- రచయితలకు, కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఎదుటి వారి నుండి విమర్శలురాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కీలకమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయం మీ శ్రీమతికి నచ్చదు. ఊహాగానాలతోకాలం వ్యర్థం చేయద్దు. ఋణం ఏ కొంతైనా తీర్చటానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
కర్కాటకం :- కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి.
 
సింహం :- అవసరపు సలహా ఇచ్చి సమస్యలకు గురికాకండి. ఊహించనివ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కళ, క్రీడా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను తొరగా ముగించుకుంటారు.
 
కన్య :- ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం, నిరుత్సాహం, చికాకులు తలెత్తుతాయి. నూతన టెండర్లు, లీజు, ఏజెన్సీల విషయంలో మెలకువ వహించండి. రాజకీయ రంగాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. విద్యార్థులలో మందకొడితనం పెరుగుతుంది.
 
తుల :- వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అసవరం. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుటారు. మిత్రులను కలుసుకుంటారు.
 
వృశ్చికం :- గృహంలో వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయాలనే మీ ఆలోచన కార్యరూపందాల్చుతుంది. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి. శత్రువులు మిత్రులుగా మారిసహాయం అందిస్తారు. ప్రియతముల కోసం నూతన పథకాలు వేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
ధనస్సు :- రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలలో ఆటంకాలు తప్పవు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి.
 
మకరం :- నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. అయిన వారిని ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు. ఇవ్వాల్టి పనులు రేపటికి వాయిదావేయకండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం.
 
కుంభం :- ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారులతో మాటపడకతప్పదు. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులచేజారి పోతాయి. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం.
 
మీనం :- ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు. కేటరింగ్, హోటల్ తినుబండ వ్యాపారులకు శుభదాయకంగా ఉండగలదు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు.