గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

నైవేద్య విరామంలో శ్రీవారిని దర్శనం చేసుకున్న రేవంత్ రెడ్డి దంపతులు

revanth reddy couple
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దంపతులు ఆదివారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామంలో ఆయన తన కుటుంబంతో కలిసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి చెందాలని స్వామిని కోరుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని తెలిపారు. 
 
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఆలయ పండితులు రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డికి వేద ఆశీర్వాదం, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్వామివారి పట్టువస్త్రాలతో పాటు తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. 
 
ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని స్వామిని కోరుకున్నట్టు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్థిక, రాజకీయ సంబంధాలు బాగుండాలన ప్రార్థించినట్టు వివరించారు. తెలంగాణాకు మంచి రోజులు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు.