సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2023 (11:38 IST)

పార్టీ మారుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు : నటి విజయశాంతి

vijayashanthi
తాను పార్టీ మారుతున్నాంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ సినీ నటి, బీజేపీ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. అదేసమయంలో తాను పార్టీ మారడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో స్పష్టంచేశారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు ఆమె హాజరై ప్రసంగించారు. తాను బీజేపీని వీడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని, తాను పార్టీని ఎందుకు వీడుతానని ఆమె స్పష్టంచేశారు. 
 
కాగా, ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమెను ఆ పార్టీ నాయకత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. దీనికితోడు తన గురించి ఎన్నో రకాలైన ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నప్పటికీ ఆమె మాత్రం ఎక్కడా కూడా నోరు విప్పలేదు. 
 
ఈ ప్రచారం ఇలా సాగుతుంటే, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. మరో రెండు మూడు రోజుల్లో విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారంటూ ప్రకటించి, ఈ ప్రచారానికి మరింత ఊపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంతో పాటు వైరల్ కావడంతో విజయశాంతి నోరు విప్పక తప్పలేదు. తాను బీజేపీని వీడుతున్నట్టు సాగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని ఆమె స్పష్టంచేశారు.