గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (18:14 IST)

బీజేపీ నాలుగో విడత అభ్యర్థుల జాబితా విడుదల_జనసేన పోటీ చేసే సీట్లపై..?

bjpjsp
తెలంగాణలో బీజేపీ నాలుగో విడత అభ్యర్థుల జాబితా విడుదలైంది. 12 మందితో నాలుగో జాబితా విడుదలైంది. ఇప్పటివరకు బీజేపీ 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. 52 మందితో తొలి జాబితాను, 33 మందితో రెండో జాబితాను విడుదల చేసిన పార్టీ మూడో జాబితాలో ఒకరి పేరును మాత్రమే ప్రకటించింది.
 
తాజాగా నాలుగో దశలో 12 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు. బీజేపీ ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో మరో 19 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో కొన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. 
 
జనసేన డిమాండ్ చేస్తున్న సీట్లను ఆ పార్టీకి కేటాయించే అవకాశాలున్నాయి. మంగళవారం ప్రధాని పాల్గొనే సభలో పవన్ పాల్గొననున్నారు. జనసేన పోటీ చేసే సీట్లపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. తాజా జాబితాలో చెన్నూరు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించారు. 
 
మాజీ ఎంపీ వివేక్‌కు ఇస్తారని భావించారు. అయితే చివరి నిమిషంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో దుర్గం అశోక్‌కు సీటు కేటాయించారు. విద్యాసాగర్‌రావు కుమారుడికి ఇస్తారని భావించిన వేములవాడ టిక్కెట్‌ను టీఆర్‌ఎస్‌ నుంచి తుల ఉమకు కేటాయించారు.  
 
ఎల్లారెడ్డి సీటును వడ్డేపల్లి సుభాష్‌రెడ్డికి కేటాయించారు. హుస్నాబాద్‌లో బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తికి కేటాయించారు. సిద్దిపేట సీటును దూది శ్రీకాంత్ రెడ్డికి ప్రకటించారు. వికారాబాద్‌లో పెద్దింటి నవీన్‌కుమార్, కొడంగల్‌లో బంటు రమేష్‌కుమార్, గద్వాల్‌లో బోయ శివ, మిర్యాలగూడలో సాదినేని శ్రీనివాస్, మునుగోడులో చల్లమల్ల కృష్ణా రెడ్డి, నకిరేకల్ ఎస్సీ స్థానానికి నరకంటి మొగులయ్య, ములుగు ఎస్టీ స్థానం నుంచి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్.
 
శేరిలింగంపల్లి, తాండూరు, నాగర్‌కర్నూల్, కోదాడ, కొత్తగూడెం, కూకట్‌పల్లి స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని జనసేనకు ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సేరిలింగంపల్లి సీటును బీజేపీకి కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తోంది.