1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2023 (07:50 IST)

బాలికపై అత్యాచారం : దోషిగా తేలిన క్రికెటర్ ఎవరు?

sandeep-lamichhane
నేపాల్ క్రికెట్ జట్టుకు చెందిన ఓ క్రికెటర్ అత్యాచారం కేసులో దోషిగా తేలారు. ఓ మైనర్ బాలికపై లైంగికదాడి చేసినందుకు ఆయనను నేపాల్ కోర్టు దోషిగా తేలింది. గత యేడాది ఓ హోటల్‌లో తనపై అఘయిత్యానికి పాల్పడ్డారంటూ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. ఘటన సమయంలో బాధిత బాలిక మైనర్ కాదని వెల్లడైంది. అయితే, ఈ కేసులో జనవరి పదో తేదీన ముద్దాయికి జైలుశిక్షను కోర్టు ఖరారు చేయనుంది. 
 
గత యేడాది ఆగస్టు 21వ తేదీన నేపాల్ రాజధాని ఖాట్మండులో ఓ హోటల్‌లో నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లామిచానే తనపై అత్యాచారానికి పాల్పడాడంటూ 17 యేళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను మభ్యపెట్టి హోటల్‌కు తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆ లామిచానేను విచారణకు పిలిచారు. 
 
ఆ విచారణకు పిలిచిన సమయంలో లచామినే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నందున స్వదేశానికి రాలేకపోయాడు. ఇందులో నేపాల్ పోలీసులు ఇంటర్ పోల్‌ను ఆశ్రయించారు. దీంతో వారు లచామినేని అదుపులోకి తీసుకుని నేపాల్ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఈ కేసులో లచామినే బెయిల్‌‍పై విడుదలయ్యాడు. 
 
ఈ కేసు విచారణ కోర్టులో సాగుతూ వచ్చింది. ఈ క్రమంలో కేసులోని ఆధారాలను పరిశీలించిన కోర్టు.. లచామినేను దోషిగా తేల్చి, జనవరి 10వ తేదీన శిక్షను ఖరారు చేయనుంది. కాగా, 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కూడా లచామినే ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.