బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (13:00 IST)

120 మంది మహిళలను అత్యాచారం చేసిన జిలేబీ బాబా... ఎలా?

jilebi baba
హర్యానా రాష్ట్రంలో జిలేబీ బాబాగా గుర్తింపు పొందిన అమర్ వీర్ (63) అనే కీచకుడు ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ మళ్లీ అత్యాచారాలు చేశాడు. ఈ వీరందరికీ మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కోర్టు విచారణలో తేలింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
అమీర్‌కు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నాయి. భార్య చనిపోయింది. 23 యేళ్ల కిందటే పంజాబ్‌లోని మాన్సా పట్టణం నుంచి హర్యానాలోని తొహానాకు వలస వచ్చాడు. 13 యేళ్ల పాటు అతడు ఓ జిలేబీ దుకాణం ప్రారంభించాడు. ఆ సమయంలో ఓ తాంత్రికుడితో పరిచయం ఏర్పడింది. అది అతని జీవితాన్ని మలుపుతిప్పింది. 
 
క్షుద్రపూజలపై ఆసక్తి చూపాడు. ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయిండా. కొన్నాళ్ల తర్వాత తిరిగివచ్చి ఓ ఆలయం, దాని పక్కనే ఇల్లు నిర్మించాడు. అక్కడ నుంచి ఆయన తనను బాబాగా ప్రచారం చేస్తూ పలువురు భక్తులను తయారు చేసుకున్నాడు. వారిలో చాలామంది మహిళలే కావడం గమనార్హం. అప్పటి నుంచి ఆయన జిలేబీ బాబాగా స్థిరపడిపోయాడు. 
 
ఈ క్రమంలో గత 2018లో ఓ పరిచయస్తుడి భార్యపై గుడిలో అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా తన అఘాయిత్యాలకు వీడియో తీసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ పదేపదే అత్యాచారాలకు పాల్పడసాగాడు. ఈ క్రమంలో ఆయనకు బెయిల్ లభించింది. అయితే, ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో అతడి పాపం పండింది. కోర్టులో అతడి నేరాలు నిరూపితమయ్యా. దీంతో ఆయనకు 14 యేళ్ల కోర్టు జైలుశిక్ష విధించింది.