బుధవారం, 18 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

రోహిత్ శర్మ అసాధారణ రికార్డు.. ఏంటది?

Rohit Sharma
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అసాధారణ రికార్డుు సృష్టించాడు. టీ20 ఫార్మెట్‌లో ఎవరికీ అందని విధంగా రికార్డును నమోదు చేశాడు. ఈ ఫార్మెట్‌లో అత్యధికంగా ఐదు సెంచరీలు చేసిన తొలి ఆటగాడుగా నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే కోహ్లీని అధికమించి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా అవతరించాడు. ఈ విషయంలో 1570 పరుగులకే ఇప్పటికే మొదటి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీని దాటేశాడు. 
 
కాగా, ఆప్ఘనిస్థాన్‌పై మూడో టీ20లో రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. 69 బంతుల్లో 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్స్‌ర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోరుకే వెనుదిరిగినప్పటికీ రోహిత్ కడదాకా క్రీజులో ఉండిపోయాడు. దీంతో 2018లో లక్నో వేదికగా వెస్టిండీస్‌పై సెంచరీ తర్వాత రోహిత్ శర్మ మరో టీ20 సెంచరీ చేశాడు. ఇక 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై చేసిన 118 పరుగుల అత్యధిక స్కోరును ఆప్ఘనిస్థాన్‌పై రోహిత్ అధికమించాడు. 
 
మరోవైపు, బెంగుళూరులో పర్యాటక ఆప్ఘనిస్థాన్ జట్టుతో జరిగిన టీ20లో భారత్ విజయభేరీ మోగించింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో మరోమారు సూపర్ ఓవర్ నిర్వహించి, ఫలితాన్ని తేల్చారు. ఇందులో భారత్ విజయభేరీ మోగించింది. తద్వారా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌‍ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.