సంబంధిత వార్తలు
- మహారాష్ట్ర: ఒంటరిగా వున్న మహిళ వద్ద అలా నడుచుకున్నాడు.. గరిటెతో..?
- బీఆర్ఎస్ నాయకుడి రాసలీలలు.. చెప్పుతో కొట్టిన భార్య.. వీడియో
- అటల్ సేతు బ్రిడ్జిపై దూకిన యువతి.. క్యాబ్ డ్రైవర్, పోలీసులు అలా పట్టుకున్నారు.. (వీడియో)
- ఎల్‌టిఐ మైండ్‌ట్రీ ఫౌండేషన్ సాయంతో 80 మంది యువతకు ఐటీలో ఉద్యోగాలు
- వివాహిత ప్రాణం తీసిన వాట్సాప్ గ్రూపు వివాదం
వివాహితపై అఘాయిత్యం.. భర్తతో కలిసి మద్యం సేవించి ఆపై...
ఏపీలోని ఏలూరులో ఓ వివాహితహై సామూహిక అఘాయిత్యం జరిగింది. వివాహిత భర్తతో కలిసి మద్యం సేవించిన కొందరు యువకులు ఆ తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డారు. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఈ దారుణం ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయికి చెందిన వ్యక్తి, భార్యతో కలిసి 15 రోజుల క్రితమే నగరానికి వచ్చాడు. ఒకటో పట్టణ రామకోటి ప్రాంతంలో ఉంటూ పగలు హోటళ్లలో పనిచేస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. అద్దె ఇల్లు కోసం ప్రయత్నిస్తున్న వీరు రాత్రివేళ రామకోటిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్టేజీపై నిద్రించేవారు.
చిన్నచిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరిగే నగరానికి చెందిన ముగ్గురు యువకులు వీరికి పరిచయమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి వివాహిత భర్తతో కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి అతడిపై దాడిచేసి ఆయన భార్యను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెపైనా దాడి చేశారు.
మరోవైపు, యువకులు తన భార్యను లాక్కెళ్లడంతో నిస్సహాయుడైన భర్త రోడ్డుపైకి వచ్చి కేకలు వేశాడు. ఓ యువకుడికి విషయం చెప్పాడు. అతడు అక్కడికి వెళ్లే సరికి నిందితులు ముగ్గురూ పరారయ్యారు. బాధిత మహిళ భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు. వీరిని చెంచు కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేటకు చెందిన నారపాటి నాగేంద్ర, మరడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డ విజయ్కుమార్ అలియాస్ నానిగా గుర్తించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు.
తర్వాతి కథనం
