10 సెకన్లలో 9 సార్లు కత్తితో దాడి, యూ ట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య
ఫోటో కర్టెసీ: సోషల్ మీడియా
ఈ హత్య గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. నిందితుడు హరిబాబు తన భార్య, యూ ట్యూబర్ వైష్ణవి హత్య కేసులో బెయిల్ పైన బైటకు వచ్చాడు. నిజామాబాదులోని రాజరాజేంద్ర చౌరస్తాలో మక్కబుట్టలు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు. మంచినీళ్లు తాగేందుకు పక్కనే వున్న చాట్ బండి వద్దకు వెళ్తుండగా కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. కారు నుంచి దిగిన ఓ వ్యక్తి కత్తితో హరిబాబు తలపై పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా నరికాడు. దాంతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు హరిబాబు తన భార్య, యూ ట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు. 19 ఏళ్ల వైష్ణవి నాలుగు నెలల గర్భిణిగా వున్న సమయంలో ఆమె గొంతు నులిమి, ఆమె నుదిటిపై అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఆరోపణలు వున్నాయి. వైష్ణవి తండ్రి ఫిర్యాదు చేయడంతో హరిబాబును అరెస్ట్ చేసారు. ప్రస్తుతం అతడు బెయిల్ పైన విడుదలై వచ్చాడు. ఈరోజు అతడిని గుర్తు తెలియని వ్యక్తులు పొడిచి హత్య చేసారు.

