మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి? (Video)
వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనకోడలు బృష్టి ముఖర్జీ ఘటక్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె వయసు 28 యేళ్లు. రాంపూర్ హాట్‌లోని తమ నివాసంలోనే మంగళవారం మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడ్డారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించగా, అప్టికే ఆమె ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ధృవీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
బృష్టి ముఖర్జీకి ఆమె భర్తతో విడాకుల కేసు విచారణ దశలో ఉందని కుటుంబసభ్యులు వెల్లడించారు. దీంతో కొంతకాలంగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బృష్టి కూడా అక్రమంగా ఉద్యోగం పొందారని ఆరోపణలు వచ్చాయి. ఆ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆమె ఉద్యోగం కోల్పోయారు. దీనికితోడు భర్తతో విభేదాలు, విడాకులు, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు.
#WATCH | Niece of former West Bengal CM Mamata Banerjee found dead at her father's residence in Kusumba village, Rampurhat in Birbhum. Police present at the spot. Further Police action is underway: SP Birbhum
— ANI (@ANI) September 1, 2026
Visuals from the spot. pic.twitter.com/pRYcfRgpqB
